ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని జాతీయ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది.ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల అమలుపై ..ప్రత్యేక హోదా నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం చేస్తుంది.అందులో భాగంగా గత పన్నెండు రోజులుగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా పదకొండు
సార్లు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది వైసీపీ పార్టీ.
అంతే కాకుండా ఏపీ ప్రజల సమస్యను ..బాధను అర్ధం చేసుకొని ఎన్డీఏ సర్కారు తీరుకు నిరసనగా ఈ రోజు ఏప్రిల్ ఆరో తారీఖున తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలనీ లోక్ సభ వైసీపీ పార్టీ ఎంపీలు ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్ లో తమ రాజీనామా లేఖలను సిద్ధం చేశారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ కేవలం స్వార్ధ రాజకీయాల కోసమే రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించకుండా ..లోక్ సభ సభ్యులను రాజీనామా చేయించడం వెనక పెద్ద కుట్ర ఉందని అన్నారు.
దీంతో ప్రముఖ జాతీయ మీడియాకి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ వైసీపీ పార్టీ కనీసం లోక్ సభ సభ్యుల చేత రాజీనామా చేయించింది.మీరు ఎందుకు చేయడంలేదు.రాజ్యసభ సభ్యుల చేత చేయిస్తే ఏమి లాభం ఉంటుంది.మరి మీరు చేయించ వచ్చు కదా రాజ్యసభ ,లోక్ సభ సభ్యుల చేత అని సడెన్ గా ప్రశ్నించడంతో అవాక్కైన చంద్రబాబు వెంటనే తేరుకొని What Am Saying అంటూ ఆంగ్లంలో మాట్లాడటం మొదలెట్టబోయాడు.
అయితే సదరు రిపోర్టర్ అవకాశం ఇవ్వకుండా ఒకవైపు ప్రజల కోసం పోరాడుతున్న జగన్ పై దుష్ప్రచారం చేస్తూ మీరు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.మీమీద కేసులుండటం వలనే మీరు కేంద్రాన్ని ఎదిరించడం లేదన్నది నిజామా అని ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలను సంధించాడు.దీంతో బాబు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాక అక్కడ నుండి విశ్రమించాడు.అయితే జాతీయ స్థాయిలో జగన్ ను బుక్ చేద్దామని భావించిన చంద్రబాబు అడ్డంగా దొరికి పరువు పోగొట్టుకున్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..మిగిలిన దానికోసం వీడియో చూడండి ..