నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు తీపికబురు అందించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని పరీశిలించిన ఎంపీ కవిత ఈ సందర్బంగా తాను గమనించిన విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్ లో సిబ్బంది సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఢిల్లీలో పని చెసే తెలంగాణా జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ లను డిల్లిలోని అన్ని హాస్పిటల్స్ లో వర్తింపచేయాలని తెలంగాణ భవన్ కమీషనర్ అశోక్ కుమార్‌కు ఎంపీ కవిత సూచించారు. భవన్లో తెలంగాణా రాష్ట్రాంలో ప్రాచుర్యంలో ఉన్న చేనేత వస్త్రాలు, బవాచీ బిర్యాని, ఇతర ప్రాంతీయ ఆహార పదార్థాల కోసం ఫుడ్ సెంటర్ లను ఎర్పాటు చేయ్యాలని అధికారులకు ఆదేశించారు.