సాధారణంగా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్రహసనం. ఎన్నో దశలు దాటుకొని చేయాల్సిన ప్రయాణం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజకీయాలకు, పరిపాలన శైలికి పునర్ నిర్వచనం ఇచ్చిన కేటీఆర్ ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎందరికో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. తాజాగా ఓ చిన్నారికి మంత్రి కేటీఆర్ ఇలాగే పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే…ఆ చిన్నారిది పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్.
ఏపీకి చెందిన ఓ చిన్నారికి కంటి సమస్య ఎదురైంది. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆ పాపాయి తల్లిదండ్రులు చికిత్స కోసం చేరారు. అయితే వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య శ్రీ కార్డు లేకపోవడం, చికిత్స చాలా ఖర్చు అవడంతో వారు తమ ఆవేదననను పంచుకుంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. చిన్నారికి చేసే సహాయం ఆమె ప్రాణాన్ని నిలుపుతుందని పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్.. తన కార్యాలయం సమన్వయం చేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ కార్యాలయం త్వరితగతిన స్పందించి సహాయం చేసింది. రూ.2 లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వివరాలు పొందుపరిచారు. తాము మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ చిన్నారి తల్లిదండ్రులు అయిన ఏపీ వాసులు పేర్కొన్నారు.
Absolutely adorable she is @KTRoffice to coordinate with LV Prasad Eye Institute or Sarojini Devi Eye hoapiral https://t.co/Krky6RV29s
— KTR (@KTRTRS) April 6, 2018