తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయంతో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడు రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ. 10.98కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు మంచినీటి సరఫరా రిజర్వాయర్లను మంత్రి ప్రారంభించనున్నారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ, మంత్రులు మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కె. జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్. ప్రభాకర్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొననున్నారు.