అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖ మాత్యులు జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు , ఎం.బిసి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ సందర్శించారు.
ఆధునిక యంత్రాల ద్వారా తయారవుతున్న పాత్రలను, యంత్రాల యొక్క పని తీరుని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం లో పేద వెనుకబడిన వృత్తి పనులు చేసుకునే వారికి సబ్సిడీ తో ఇటువంటి ఆధునిక యంత్రాలను అందించేందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అందులో భాగంగానే 3 రోజుల పాటు ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారి తో గుజరాత్ లోని వివిధ ప్రాంతాలలో వృత్తి పని చేసుకునే వారికి ఉపయోగ పడే ఆధునిక యంత్రాలను పరిశీలించేందుకు పర్యటిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.