సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో భారతదేశపు తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఒక దళితుడికి ఘోర అవమానం జరిగింది.అసలు విషయానికి వస్తే ఏపీలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.ఎప్పటిలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు సొంత డబ్బా కొట్టుకోవడమే కాకుండా మరోవైపు జగ్జీవన్ రామ్ ,అంబేద్కర్ లాంటి మహనీయులే నాకు ఆదర్శం ..వాళ్ళ స్పూర్తిగా ఆధారంగా చేసుకొని పేదరికం లేని సమసమాజం చూడటమే తన లక్ష్యం.దళితులపై దాడులకు తెగబడిన ..వార్ని చిన్నచూపు చూసిన కానీ సహించేది లేదు.కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎప్పటిలా తెగ పోగేడేసుకున్నారు చంద్రబాబు తన గురించి.
ఈ క్రమంలో జయంతి సందర్భంగా ఒక దళితుడ్ని వేదికపైకి తీసుకొచ్చారు.అయితే అతడు దళితుడు మాత్రమే కాదు అంగవైకల్యం కూడా ఉంది.ఆయనకు చేతులు లేవు .అటువంటి వ్యక్తికీ స్వీట్ తినిపించారు చంద్రబాబు.దీనికి సమాధానంగా తనకు రెండు చేతులు లేకపోయిన దళితుడు ఎంత కష్టపడి బాబుకు స్వీటు తినిపించాలని ప్రయత్నం చేశాడు.దీంతో చంద్రబాబుకు ఎక్కడలేని పట్టరానంత కోపం వచ్చేసింది.తనకు తినిపించకుండా తన నోటి దగ్గర చెయ్యి పెట్టుకొని దళితుడ్ని ఒక్కసారిగా తోసేశాడు.అయితే వెంటనే అక్కడ కెమెరాలున్నాయి అని గుర్తించిన బాబు దళితుడ్ని లేపి మరి ఫోటోలు దిగారు ..
అంతే కాకుండా తన అధికారక యంత్రాంగానికి బాబు సైగ చేయడంతో కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడున్న దళితుడ్ని మాయం చేశారు అధికారులు.అయిన ఆది నుండి దళితులు అంటే చిన్నచూపు ఉన్న చంద్రబాబు నుండి దళితులకు మర్యాద ఇవ్వాలని ఆశీంచడం అత్యాశే అవుతుంది .సాక్షాత్తు దళిత సమాజం కోసం .వెనకబడిన అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాడి దాదాపు అర్ధ శతాబ్దం పాటు మచ్చలేని రాజకీయ నేతగా పలు పదవులలో పని చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఒక దళిత బిడ్డ జయంతి రోజు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికీ అది అంగవైకల్యం ఉన్న వ్యక్తికీ అవమానం జరగడం బాధాకరం ..