తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు పడింది.ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.అయితే వెంటనే స్పందించిన GHMC సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.నగరంలోని ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాగోలు, పంజాగుట్ట, కాప్రా, అల్వాల్, రామంతపూర్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, మొయినాబాద్, బోయినపల్లి, రాజేంద్రనగర్, గచ్చబౌలిలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది.ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళుతున్న వారు చాలా ఇబ్బందులుపడ్డారు.