ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల వారిగా రాజకీయం వేడెక్కుతుంది. ఎక్కడ ఎవరు నిలబడతారో…ఎక్కడ ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక..ఏ పార్టీ అయితే బలంగా ఉందో అందులోకి వలసలు పెరిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు రాజకీయ నేతలు వైసీపీలోకి వలసల పర్వం మొదలైయ్యింది. ఎక్కడ పాదయాత్ర జరుగుతుందో అక్కడ చాలమంది టీడీపీ, ఇతర పార్టీ నేతలు వైసీపీలో చెరారు. మరోపక్క 2014 తర్వాత కొణతాలతో పాటు వైసీపీని వీడిన వారు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి రాజకీయాల్లో చక్రం తిప్పిన గండి బాబ్జీ… కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా చేశారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం తర్వాత తన రాజకీయ గురువు కొణతాలతో కలిసి వైసీపీని వీడారు. గురుశిష్యులు టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ టీడీపీ అంతర్గత రాజకీయాల కారణంగా కొణతాలను టీడీపీ ఆహ్వానించలేదు. గండి బాబ్జీ మాత్రం మంత్రి అయన్నపాత్రుడి సాయంతో టీడీపీలో చేరిపోయారు. కానీ అప్పటి నుంచి ఆయనకు అన్నీ అవమానాలే. చివరకు తిరుపతి మహానాడులో గండి బాబ్జీని గేటు వద్దే ఆపేశారు. ఇక లోకల్‌లో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నుంచి నిత్యం పోరు తప్పడం లేదు.
ఈనేపథ్యంలో టీడీపీని వీడేందుకు గండిబాబ్జీ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ వచ్చే అవకాశాలు లేవని నిర్ధారించుకున్న బాబ్జి.. భవిష్యత్తు కార్యాచరణకు పదును పెట్టారు. ఇందులో భాగంగా ఈనెల 8న అనుచరులకు, సన్నిహితులకు, పరిచయస్తులకు బాబ్జి విందు ఏర్పాటు చేశారు.ఈ విందుకు ఆహ్వానాలు అందుకున్న వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలు, వైసీపీ సానుభూతిపరులే కావడంతో టీడీపీలో చర్చ మొదలైంది. తిరిగి వైసీపీలో చేరేందుకు బాబ్జి ఈ విందు ఇస్తున్నారని.. అందుకే టీడీపీ వారికి ఆహ్వానం పంపకుండా వైసీపీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు