ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ తగిలింది. మీడియాను నమ్ముకున్న చంద్రబాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమర్శలు చేస్తూ పలు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచరణకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు సమాచారం.
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్లో ఈ వివరాలు తెలిపారు. ‘‘బీజేపీ రెండింతల ఆత్మరక్షణలో పడినట్లు ఢిల్లీలో బలంగా వినిపిస్తున్న గుసగుసలు ధ్రువీకరిస్తున్నాయి . చంద్రబాబు నాయుడితో పూర్తి నిడివి ఇంటర్వ్యూలు చేసిన రెండు ఛానళ్ళకు ఆ ఇంటర్వ్యూలను ప్రసారం చేయవద్దని చెప్పారు’’ అని డెరెక్ ఒబ్రెయిన్ సంచలన ట్వీట్ చేసారు.
Strong Delhi buzz confirming BJP on the double defensive. At least two TV channels who shot full interviews with @ncbn Chandrababu Naidu told not to run the same
— Derek O'Brien (@derekobrienmp) April 5, 2018