అతి త్వరలోనే మరో నాలుగు వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు,హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి నాయి ని మాట్లాడుతూ..రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని.. కొత్తగా 45 పోలీసు స్టేషన్లు నిర్మించామని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు
