ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో జగన్ తో పాటు వేలదిమంది ప్రజలు అడుగులో అడుగు వేస్తు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు గురువారం(129వ రోజు) పాదయాత్రను జిల్లాలోని వేజెండ్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని ప్రజలతో మమేకమవుతారు. అనంతరం పాలపూడి క్రాస్, గరువుపాలెంల మీదుగా శేకూరు క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.
