Home / ANDHRAPRADESH / మాల్యాతో సంబంధాలు ఎవరికి?..చంద్రబాబుకా? .జగన్‌కా?.

మాల్యాతో సంబంధాలు ఎవరికి?..చంద్రబాబుకా? .జగన్‌కా?.

దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ మాల్యాతో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని వైసీపీ శ్రేణులు ..లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్నాయి అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు . అయితే ఎవరికీ ఎవరితో సంబంధాలున్నాయో సవివరంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఉన్నది ఉన్నట్లుగా మీకోసం “అసలు విజయ మాల్యాతో సంబంధాలు ఎవరికి?చంద్రబాబుకా? వైయస్‌ జగన్‌కా?..మాల్యాకు సన్నిహితుడు టీడీపీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు భార్య సత్యప్రభ టీడీపీ ఎమ్మెల్యే.కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని వారి కాలేజీలో కోట్లాది రూపాయల నోట్లకట్టలు పట్టుబడ్డాయి .అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో మాల్యాకు సంబంధాలు ఉన్నాయి?.ఈ ఇద్దరి సహాయంతో చంద్రబాబు వ్యవహారాలు నడపలేదా? ..వైయస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిచేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉన్నందునే విషయాన్ని వైఎస్‌ జగన్‌ కుటుంబంపైకి మళ్లించారా?

రాష్ట్రంలో రాజకీయ విషప్రచారాలు అట్టడుగుస్థాయికి చేరాయి. ప్రతిపక్షనేత కుటుంబాన్ని, వారి వ్యక్తిత్వాలను లక్ష్యంగా చేసుకుని 2014 ఎన్నికల్లో టీడీపీచేసిన ప్రచారం – వారి వ్యహాల్లో ఒక భాగం. ఇది విజయవంతమైందా? లేక రాజకీయల్లో విలువలను భ్రష్టుపట్టించిందా? అన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. నిజం నిలకడమీద తెలుస్తుందన్నట్టుగా…
ఆనాటి విషప్రచారాలు.. నాలుగు ఏళ్లుగా మంచుతెరల్లా కరిగిపోతున్నాయి. వైఎస్‌ జగన్‌ అంటే ప్రతికూల అభిప్రాయాలు ఉన్న అనేకమంది వ్యక్తులు.. ఇప్పుడు ఆయన పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉండడమే దీనికి నిదర్శనం. ఇది టీడీపీలో కంగారుపుట్టించవచ్చు. అందుకే మరో ప్రచారానికి టీడీపీ తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే..
టీడీపీ ఎంచుకున్న ప్రచార అంశం – తెలుగుదేశం పార్టీ విలువల పతనంలో అట్టగుస్థాయి మార్కును చాటుతోంది. వైయస్సార్‌సీపీ అధ్యుడు, ప్రతిపక్షనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌ కుమార్తె… పెద్ద కుమార్తె లండన్‌లో చదువుకుంటున్నారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి , దేశం నుంచి తప్పించుకుపోయి లండన్‌లో ఉంటున్న మాల్యా ఇంట్లో వైయస్‌ జగన్‌ కుమార్తె ఉన్నారన్నది టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం. మొదటగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంచేసిన టీడీపీ – ఆతర్వాత నేరుగా టీవీ డిబేట్లలో ప్రస్తావించడం మొదలుపెట్టింది. టీడీపీ విపరీత ధోరణిపై అనేక వేదికలపై వక్తలు విరుచుకుపడ్డారు. కుటంబాలను లక్ష్యంగా చేసుకుని, అందులోనూ వైయస్‌ఆర్‌ గారి మనవరాలిపై చేసిన విషప్రచారం పట్ల సోషల్‌మీడియా సమాజం మొత్తం టీడీపీ పార్టీని కడిగిపారేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ టీడీపీ తీరును ఎండగడుతూ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.

1. విజయ్‌మాల్యాకు అత్యంత సన్నిహితులైన డీకే ఆదికేశవులనాయుడు భార్య సత్యప్రభ, ఆయన కుమారుడు శ్రీనివాస్‌ టీడీపీ నేతలు కారా. గడచిన కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో ఈ కుటుంబం కీలకంగా లేదా. మొన్నటిమొన్న ఐటీదాడుల్లో డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానికి చెందిన విద్యాసంస్థపై ఐటీ అధికారులు
జరిపిన దాడుల్లో రూ.43 కోట్ల రూపాయల నగదు పట్టుబడ లేదా?2. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మాల్యా అత్యంత సన్నిహితుడు కాదా?.3. శెనక్కాయలు, డీజిల్‌ చంద్రబాబు అమ్ముకున్న చరిత్రను ఆయన పార్టీ కార్యకర్తలు మరిచిపోతున్నారా?.4. దివంగత మహానేత వైయస్సార్‌ స్కూలు చదివే రోజుల్లోనూ ఆదాయపుపన్ను చెల్లించారు.
రెండెకరాల చంద్రబాబు ఆరోజుల్లోనే తన ఆర్థిక అవసరాలకోసం వైయస్‌ఆర్‌పై ఆధారపడ్డ విషయాన్ని మరిచిపోతున్నారా?.

5. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మనవరాలు, వైయస్‌ జగన్‌ కుమార్తె..చంద్రబాబు కుమారుడు లోకేష్‌లా టెన్త్‌ పాసవడానికి, ఇంటర్మీడియట్‌పాసవడానికి ఆపసోపాలు పడలేదు. లోకేష్‌ను ఇంటర్మీడియట్‌ పాస్‌ చేయించడానికి– ప్రస్తుత మంత్రి నారాయణ చేసిన విన్యాసాలు ఎన్ని?.6. వైయస్‌ జగన్‌ కుమార్తె.. అత్యుత్తమ మార్కులతో ప్లస్‌ టూ పూర్తిచేసి ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాల లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సీటు సాధించారు. దీన్ని కాదనగలరా?.7. సోనియా చంద్రబాబులు ఇద్దరూ కలిసి వైఎస్‌ జగన్‌పై అక్రమకేసులు పెట్టించారు. ఈ ఘటనతో వైఎస్‌ జగన్‌ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభ, వ్యథ చెప్పరానివి. ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య ఆయన కుమార్తె… ఒక లక్ష్యంతో ముందుకుసాగి లండన్‌ స్కూల్‌ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సీటు సాధించారు. దీన్ని టీడీపీ తట్టుకోలేకపోతోందా?.

8. లోకేష్‌కు అమెరికా చదువులు చెప్పించడానికి సత్యంరామలింగరాజు ఫీజులు కట్టాల్సి వచ్చింది. అలాంటి దౌర్భాగ్య స్థితి వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఉందా? తన కుమార్తెను చదివించుకోలేని స్థితిలో వైఎస్‌ జగన్‌ ఉన్నారా?.9. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిచేసిన ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు నోరువిప్పడంలేదు. చంద్రబాబు లండన్‌లో మాల్యాను ఎందుకు
కలిశారు?రూ.150 కోట్ల నిధులను ఎందుకు తీసుకున్నారన్న దానిపై టీడీపీ అధికారికంగా ఎందుకు స్పందించడంలేదు? అని ఒక పోస్టు వైరల్ అవుతుంది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat