ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమాలో కైరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 20 న విడుదలకానుంది.అయితే ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లు,పాటలు ,టీ జర్ విడుదల చేస్తూ అభిమానుల్లో సినిమా పై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు చిత్ర యూనిట్.గత కొంత సేపటి క్రితం ఈ సినిమాలో నుండి మూడోవ పాటను విడుదల చేశారు.కొద్ది నిమిషాల్లోనే ఈ పాటను 5 లక్షల మంది వీక్షించారు. వచ్చాడయ్యో సామి అంటూ సాగే ఈ పాటని కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడగా , దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట కూడా సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. ఆ పాటను మీరు విని ఎంజాయ్ చెయ్యండి.