తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ఎంపీలకు కీలక సూచన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మలి విడుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఉభయసభలు కొన్ని గంటలు కూడా సాగని సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగని నేపథ్యంలో ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.గురువారం, శుక్రవారం జరుగనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరుకావద్దని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగని నేపథ్యంలో కనీసం నియోజకవర్గ ప్రజలకైనా అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చాలని తమ అధినేత సూచించారని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి మీడియా కు తెలిపారు.దీంతో పలువురు ఎం పీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
