తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి
చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ టీడీపీ గూటికి రానున్నారు అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఆమె ఎవరో కాదు నిన్న మొన్నటి వరకు ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ల మధ్య కొనసాగిన ..కొనసాగుతున్న వార్ లో ప్రధాన పాత్ర అయిన పూనమ్ కౌర్ .ఆమె త్వరలోనే టీడీపీ పార్టీలో చేరనున్నారు అని తెలుగుతమ్ముళ్ళు అంటున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడమే కాకుండా ఏకంగా టీడీపీ పార్టీ అవినీతి అక్రమాలపై విరుచుకుపడుతున్నారు.అందులో భాగంగా పవన్ విమర్శలకు తాడు వేయడానికి ..ఆయన్ని కంట్రోల్ చేయడానికి పవన్ గురించి తెల్సిన పూనమ్ కౌర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ పెద్దలు చర్చలు కొనసాగిస్తున్నారు అంట .
అయితే ఇటివల పూనమ్ పవన్ కళ్యాణ్ గురించి ఎవరు నమ్మలేని నిజాల గురించి వీడియోలు ఉన్నాయని ..అందుకు నాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పాయింట్మెంట్ కోరిన సంగతి తెల్సిందే .అయితే పూనమ్ అప్పాయింట్మెంట్ కోరడం వెనక ఉన్న అసలు కారణం ఆమె పార్టీలో చేరడమే అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు .చూడాలి మరి పూనమ్ ఎంట్రీ పై వస్తున్నా వార్తల్లో ఎంతవరకు నిజమో..!