రెండేళ్ళు ఎంతో అల్లారుగా ,ప్రేమతో పెంచిన తల్లికే చిన్నారి తన్విత చేరింది.తన్విత ను కన్న తల్లి కాదనుకున్న.. ప్రేమగా పెంచిన తల్లి తన ప్రేమతో గెలిచింది. వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది.మహబూబా బాద్ జిల్లాకు జిల్లాకు చెందిన బావుసింగ్, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.అయితే మళ్లి ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్దారణ పరీక్షల్లో గ్రహించిన బావు సింగ్ అబార్షన్ కోసం ప్రయత్నించాడు.అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది.
ఈ క్రమంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్న రాజేంద్రప్రసాద్, స్వరూపలకు వారి విషయం తెలిసింది. దీంతో స్వరూప, రాజేంద్రప్రసాద్ దంపతులు బాపుసింగ్, ఉమల నుండి పాపను దత్తత తీసుకున్నారు. అయితే రెండేళ్ల తర్వాత ఉన్నట్టుండి స్వరూప వద్ద తన కూతురు చిన్నారి తన్వితను తనకు అప్పగించాలని ఉమ గత కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలను పోలీసులు పిలిపించి స్టేషన్లో మాట్లాడించారు. ఇద్దరూ తమకే చిన్నా రి తన్విత దక్కాలని పేర్కొ న్నారు. దీంతో ఫలితం దక్కకపోవడంతో.. వారు కోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు తన్వితను ఖమ్మం లోని బాలసదన్‌లో ఉంచాలని ఆదేశించింది. అయితే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్వరూప దంపతులు రాష్ట్రంలోని కొత్తగూడెం ఐదో మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. పుట్టినప్పటినుంచి తన్విత తమ వద్దనే ఉందని వారు కోర్టులో తమ వాదనలను వినిపించారు. వారి వాదనను విన్న కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. పెంపుడుతల్లి స్వరూప దంపతులకు తన్వితను అప్పగించాలని బుధవారం తీర్పును వెలువరించింది.