బాలీవుడ్ కండల వీరుడు ,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ ..సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశాయోక్తి కాదేమో .అంతగా ఒకపక్క నటనతో ..మంచి హిట్లను సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు.
అయితే సల్మాన్ ఖాన్ ను ఎప్పటి నుండో కృష్ణ జింకల వేట కేసు వెంటాడుతూ వస్తున్నా సంగతి విదితమే .తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న సల్మాన్ ఖాన్ ,సైఫ్ ఆలీఖాన్,టాబు,సోనాలీ బింద్రే,నీలమ్ లపై జోద్ పూర్ న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది.ఈ నేపథ్యంలో ఈరోజు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్దారిస్తూ మిగిలినవార్ని నిర్దోషులుగా కోర్టు తీర్పును వెలువరించింది ..దీంతో ఇండస్ట్రీలో ,కోర్టు తదితర పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ..