తెలంగాణ రాష్ట్రం పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.భారతదేశంలోనే చిన్న రాష్ట్రమైన అభివృద్దిలో దూసుకుపోతున్నదని కితాబిచ్చారు.దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. ఇవాళ దేశరాజధాని డిల్లీలో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ దగ్గరకు తీసుకెళ్లి టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను మన్మోహన్‌కు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఇలానే కొనసాగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
