ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ఇటు విపక్ష నేతలతో పాటుగా అటు పలువురు స్వపక్ష టీడీపీ నేతలు సైతం చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల తరఫున గళం వినిపించడం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరు ఆకాంక్షలు నెరవేర్చేలా లేదని తన స్వలాభం కోసం ప్రజజల భవిష్యత్‌ను తాకట్టుపెట్టినట్లు ఉందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించిన తీరును ఈ సందర్భంగా పలువురు సీమాంధ్రులు గుర్తుచేసుకుంటున్నారు. ఒక్కడుగా మొదలైన కేసీఆర్‌ను నిలువరించేందుకు ఎన్ని శక్తులు ఎదురైనా ప్రాంతీయ నేతలు మొదులకొని జాతీయ నాయకుల వరకు కేసీఆర్ లక్ష్యంగా ఎన్నో ఎత్తులు వేశారని ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తనదైన రాజకీయాలతో వ్యూహలు రూపొందించి మెరుపు వేగంతో వాటిన ఆచరణలో పెట్టి ఢిల్లీని వణికించి తెలంగణను సాధఙంచుకున్నారని విశ్లేషిస్తున్నారు.
సరిగ్గా అలాంటి పోరాట శైలిఏపీకి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం ఉంటే..ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ రాజకీయ సత్తాను చాటలేకపోతున్నారని చెప్తున్నారు. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు….ఇది డబ్బా కొట్టుకునేందుకు తప్ప మరింక దేనికి ఉపయోగించడం లేదని విమర్శిస్తున్నారు. పార్లమెంటుకు వేదికగా ఆయా పార్టీలతో కలిసి ఉద్యమించాల్సింది పోయి వంగి దండం పెట్టేందుకే తన పర్యటనను పరిమితం చేసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గులాబీ దళపతి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని…ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఇకనైనా ఆయన కృషిచేయాలని అంటున్నారు.