భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు .
అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ బంద్ సందర్భంగా ప్రాణాలను కోల్పోయిన వారికి నివాళులు కూడా అర్పించారు.ఈ సందర్భంగా పార్లమెంటు లో వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని యధాతధంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ..