ప్రముఖ టూవిల్లర్ వాహన సంస్థ బజాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అటో వాహనాల ధరలను పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లను బట్టి వాహనాల ధరలను రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఒక్కసారిగా పెంచింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో డొమినార్ 400 బైకు రూ.2 వేల వరకు ప్రియమవగా, డిస్కవరీ, ప్లాటీనా కంపోర్టెక్ మోడళ్లు రూ.500 పెరిగాయి. వీటితోపాటు అవెంజర్ 220 స్ట్రీట్, క్రూజర్లు వెయ్యి రూపాయలు, అవెంజర్ 180 రూ.1,100 వరకు పెరిగాయి.