ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర
కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది.
నేను ఏ తప్పు చేయకపోయిన కానీ ఆంధ్రప్రజలను నాపై కోపంతో అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుంది.గత నాలుగు ఏండ్లుగా కేంద్రం ఏపీకి సహకరించకపోవడంతోనే మేము ఎన్డీఏ నుండి బయటకు వచ్చామ న్నారు.రాష్ట్రంలో పేదరికం లేని సమాజం చూడటమే తన లక్ష్యం .అందుకు నాకు బాబూ జగ్జీవన్ రామ్ ,అంబేద్కర్ ఆదర్శం అని ఆయన అన్నారు ..