తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు .
ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసి గాయపరిచారనే కారణంతో కోమటిరెడ్డితో పాటుగా సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే .
అయితే ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తానని ..చేయని తప్పుకు నా సభ్యత్వాన్ని రద్దు చేశారు ..నన్ను చంపాలని కారణంతో గన్ మెన్లను తొలగించారు అని ఆయన ఆరోపించారు ..