టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో ఎంపీ సంతోష్ కుమార్ కేంద్ర మంత్రిని కలిశారు.
షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, ఉద్యోగుల విభజనను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని ఎంపీలు కోరారు. షెడ్యూల్ 9లో 93 కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లో 103 సంస్థ లు ఉన్నాయని, సంవత్సరంలోపు విభజన చెందాల్సిన ఈ సంస్థలు, 4 సంవత్సరాలు గడుస్తున్నా కేంద్రం చొరవ చూపడం లేదని ఎంపీల బృందం తెలిపింది. ఏపి సిఎం చంద్ర బాబు షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన కాకుండా అడ్డుకుంటున్నారని వారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కొత్తగా ప్రమాణం శ్రీకారం చేసిన ఎంపీలు సంబరాల్లో మునిగి తేలుతారని, కానీ, ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మా పార్టీ ఎంపీలు ప్రజా సమస్యల పై పోరుబాట పట్టారని పలు పార్టీల నేతలు ప్రశంసిస్తున్నారు. ఉద్యమ నాయకుడికి తోడుగా ఉన్న సమయంలో పనిచేసినంత చురుకుగా ఎంపీ పదవిని చేపట్టిన వెంటనే స్పందించాలరని కొనియాడుతున్నారు.