Home / ANDHRAPRADESH / 2019క‌ల్లా వైసీపీలో జ‌గ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌రు..!!

2019క‌ల్లా వైసీపీలో జ‌గ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌రు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పూర్తిగా అధ్యాయ‌నం చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి చెప్పినా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, మీరె ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్జీల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ రిలీజ్ చేయ‌లేద‌ని, అలాగే, త‌మ‌కు రుణాల‌ను స‌క్ర‌మంగా అందించ‌లేద‌ని డ్వాక్రా మ‌హిళ‌లు, మ‌రో ప‌క్క త‌మ‌కు పింఛ‌న్‌ను పంపిణీ చేసే విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అల‌స‌త్వం వ‌హిస్తుందంటూ వృద్ధులు ఇలా.. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్‌ను క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకుంటున్నారు. ఇలా వారి స‌మ‌స్య‌ల‌ను విన్న జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి … స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ.. త‌న పాద‌యాత్ర‌ల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య కొన‌సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో జ‌గ‌న్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేని అధికార పార్టీ నేత‌లు.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌ను గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అనిత టీడీపీ స‌భ‌లు నిర్వ‌హిస్తూ జ‌గ‌న్‌పై ప‌దే ప‌దే విమ‌ర్శ‌నాస్ర్తాలు గుప్పిస్తున్నారు.

see also : జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు హ్యాట్సాప్‌..!!

ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌ పాద‌యాత్రను క‌డ‌ప‌లో మొద‌లుపెట్టి.. ఇచ్చాపురం వ‌ర‌కు చేస్తాడ‌ట‌. క‌డ‌ప‌లో మొద‌లు పెట్టాడు, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పూర్తి చేశాడు. ఇలా చేస్తూపోతే ఇచ్చాపురం వ‌చ్చేస‌రికి వైసీపీలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న‌ చెల్లి త‌ల్లి త‌ప్ప ఇంకెరూ మిగ‌ల‌రంటూ కామెంట్స్ చేశారు. ఇంకా ఎమ్మెల్యే అనిత‌ మాట్లాడుతూ.. రాయ‌ల‌సీమ‌లో పెద్ద పెద్ద వికెట్లు టీడీప‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. ఇప్ప‌టికీ వైసీపీ నేత‌లు టీడీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు చేస్తున్నార‌న్నారు. అలాగే, 219 ఎన్నిక‌ల్లో ఏపీలో 90 శాతం ఎమ్మెల్యే సీట్ల‌ను టీడీపీ గెలుస్తుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు ఎమ్మెల్యే అనిత‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat