ఏపీ ప్రతి పక్షనేత ,.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజుకు చేరుకుంది. మంగళవారం వైఎస్ జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చుట్టుగుంట, అంకమ్మ నగర్, ఎత్తురోడ్ సెంటర్, నల్లచెరువు, మూడు బొమ్మల సెంటర్, ఫ్రూట్ మార్కెట్, జిన్నాటవర్ సెంటర్ నుంచి కింగ్ హోటల్ వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. మరోపక్క వైసీపీ పార్లమెంట్ సభ్యలు డిల్లీలో ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు.
