ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గ నేతలు వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా విధ్యార్థుల గుండెల్లో ఉండిపోయోలా ప్రత్యేకహోదా కోసం నిరంతరం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా తేస్తాడని ఏపీలో ప్రతి నిరుద్యోగికి,ప్రతి విద్యార్థికి నమ్మకం కలిగింది.కళాశాల విద్యార్థినులు వైఎస్ జగన్ తో కలిసి ‘అన్నా… ఒక్క సెల్ఫీ’అంటూ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని జగన్ విద్యార్థినులను ఆశీర్వదించారు.
ఈ క్రమంలో ఒక అమ్మాయి చేతి గాయంతో జగన్ దగ్గరికి వస్తే జగన్ ఏమైంది తల్లీ నీ చేతికి గాయం అంటే అది చిన్న దెబ్బా సార్ ఒక్క సెల్ఫీ అడగ్గా ఒకే తల్లీ నీ ఆరోగ్యం జాగ్రత్తా అంటూ జగన్ చెప్పారంట. తమ ప్రియతమ నేతతో ఫొటో దిగడంతో ఆ విద్యార్థినులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జగనన్నతో దిగిన ఫొటోలు సరిగా వచ్చాయా, లేదా అని ఆ విద్యార్థినులు మండుటెండను సైతం మర్చిపోయి సెల్‌ఫోన్‌లో ఫొటోలు చూసి మురిసిపోయారు.పాదయాత్ర జరిగే దారి పొడవునా ప్రత్యేక హోదా జగన్‌తోనే సాధ్యమంటూ జనం నినదించారు.తాము సైతం అంటూ రోడ్డుపైకి వచ్చి మద్దతు పలికారు. భావితరానికి బాటలు వేసేందుకు మీతో కలిసి అలుపెరగని ఉద్యమానికి సిద్ధమంటూ మహిళలు, యువత, చిన్నపిల్లలు బాసటగా నిలిచారు.