ఏపీలో వెనకబడిన జిల్లాలలో ఒకటి శ్రీకాకుళం ..పేరుకు వెనకబడిన కానీ జిల్లా కానీ రాజకీయ చైతన్యం మాత్రం అంతకు మించి ప్రజల్లో ఉంది.అయితే రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎవరు పాగా వేయనున్నారు ..ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి ..స్థానిక ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశం మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా అది కూడా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన యెల్లో మీడియా సర్వే నిర్వహించింది.
ఈ సర్వే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,అధికార టీడీపీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు ,ప్రజలకు చేరే విధానం మీద ,ప్రతిపక్షపార్టీ అయిన వైసీపీ పట్ల ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారు ఇలా పలు అంశాలను ఆధారంగా చేస్కొని సర్వే చేసింది.ఈ సర్వేలో జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉన్నాయి.అందులో జిల్లా కేంద్ర స్థానమైన శ్రీకాకుళం అసెంబ్లీకి జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన గుండ లక్ష్మీ దేవి చేతిలో ఓడిపోయారు.
అయితే అధికారంలోకి వచ్చిన లక్ష్మీదేవి పేరిట ఆమె అనుచరులు చేస్తున్న పలు అవినీతి అక్రమాలు ,ప్రతి పథకం అర్హులు కంటే ఆ పార్టీ క్యాడర్ కే దక్కడంతో ఇక్కడి స్థానిక ఓటర్లో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉండటం..ఆమె అనుచరులను మాత్రమే పట్టించుకోవడం ..గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం ..ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్న వార్ని పక్కన పెట్టడం ఇలా పలు కారణాలు ధర్మాన గెలుపుకు పెద్దగ కష్టపడకుండానే బీజం పడినట్లు తేలింది.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఆమె వెనకపడటం ..పాత బ్రిడ్జి,పొన్నాడ బ్రిడ్జి ప్రారంభోత్సవ సమయంలో కూడా జరిగిన గొడవలు ఇలా ఎలా చూసుకున్న కానీ టీడీపీ పార్టీకి గడ్డు పరిస్థితే ఎదురవుతుందని ఆ మీడియా నిర్వహించిన సర్వేలో తేలడంతో ఈ సారి లక్ష్మి దేవికి ఇవ్వడం కష్టమే అని అందుకే ధర్మాన గెలుపు నల్లేరుపై నడకే అని ఆ సర్వేలో తేలిందని తెలియడంతో షాక్ కు గురికావడం బాబు వంతైంది అంట ..