రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో నిలుపుతున్న మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికి వారికి కృతజ్ఞత తెలుపుదామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.24గంటల కరంట్ సాదించుకున్నాం,ప్రాజెక్ట్ లు పూర్తి కాబోతున్నాయి. మన ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెలదామని,దానిలో కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించాలని అన్నారు.రేపటి మంత్రి పర్యటనకు కార్యకర్తలు,ముఖ్య నాయకులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ గారి పట్ల మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ప్రేమ ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి,తెరాసా సీనియర్ నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు,డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దిన్,కార్పోరేటర్లు,కార్పోరేషన్ చైర్మన్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు