పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ఏమి చేయకపోయిన కానీ అది చేస్తున్న ..ఇది చేస్తున్న ..ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని తన ఆస్థాన మీడియా ద్వారా ప్రజలు నమ్ముతారనే భ్రమతో తెగ ప్రచారం చేయించుకుంటూ ఉంటాడు.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంటు కు వెళ్లారు .లోపలకు వెళ్ళే ముందు చంద్రబాబు పార్లమెంటు ప్రధాన ఎంట్రీ వద్ద అక్కడ స్పెషల్ గా వెంటపెట్టించుకొని తీసుకోచ్చుకున్న ఫోటో గ్రాఫర్ చెప్పిన సూచనల సలహాల మేరకు ఫోటోషూట్ కు ఫోజులిచ్చారు .
ఈ క్రమంలో సారూ ఫోటో సరిగా అనుకున్నట్లు రాలేదని చెప్పడంతో మరల ఫోటో షూట్ కు ఫోజులిచ్చారు ..చూసిన వారు ఫోటోల మీద ఉన్న యావ ప్రజాసమస్యలపై లేదని సెటైర్లు వేస్తూ విమర్శిస్తున్నారు .ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి మీరు ఒక లుక్ వేయండి ..