మరోసారి తెరపైకి అన్నదమ్ముళ్ల విభేదాలు..!! ఇప్పటి వరకు చాపకింద నీరులా కొనసాగిన బాలకృష్ణ, హరికృష్ణల విభేదాలు బయటపడ్డాయి. అది కూడా, సినీ ప్రముఖులు, అథిరథ మహారథుల సమక్షంలో నందమూరి వారసుల మధ్య విభేదాలు బయటపడటం గమనార్హం. ఇంతకీ వీరి మధ్య అంతలా విభేదాలు తలెత్తడానికి గల కారణమేమిటి..? వీరి మధ్య విబేధాలు ఎలా బయటపడ్డాయి..? అన్న వివరాల్లోకెళ్తే..!!
see also : ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించే బాధ్యతను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే తన భుజస్కంధాలపై వేసుకున్న విషయం తెలిసిందే. అనుకున్నదే తడవుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును రామకృష్ణ స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభానికి సినీ ఇండస్ర్టీ మొత్తం తరలి వచ్చింది. వారితోపాటు నందమూరి వారసులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తప్ప అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభానికి సినీ ఇండస్ర్టీలోని ప్రముఖులందరికీ ఇన్విటేషన్ పంపిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కు పంపలేదట. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ, నా కొడుకును ఆహ్వానించని ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్లనంటూ, నా తండ్రికంటే.. నా చిన్న కొడుకే నాకు ఎక్కువ అంటూ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పారట హరికృష్ణ.