తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ తీర్చామని అన్నారు.జిల్లా ఏర్పాటుతో అధికార వికేంద్రికరణ జరిగిందని అన్నారు.
కొత్తగూడెం స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఈ ప్రాంత యువతకు శిక్షణ అందిస్తామని యువతకు హామీ ఇచ్చారు. జాన్ డీర్ ,ఐటీసీ లాంటీ సంస్థలు యువతకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చాయన్నారు.బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగూడెం నిరంతరం అభివృద్దిని కాంక్షించే ప్రాంతమని..కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుందని..ఏ ఉక్కు లేని విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టారని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని నిలదీశారు .చత్తీస్‌గడ్ బయ్యారం 180కి.మీ దూరంలోనే ఉన్నా..కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,ఎమ్మెల్యే జలగం వెంకట్రావు,పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా ప్రతినిధులు ,విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.