సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది.అయితే నిద్ర లేచి ,కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మజ్జిగ త్రాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మజ్జిగలో కరివేపాకు ,అల్లం ,జీలకర్ర వంటి పోపులతో మసాల మజ్జిగను తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే మజ్జిగ తీసుకోవడం వలన ఇది కడుపును చల్లగా ఉంచి,కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తుంది.అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలను చల్లటి మజ్జిగ తీరుస్తుంది.
మజ్జిగ కడుపులో ఏర్పడే వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.అందువల్ల కడుపు ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది.అందుకు కారణం కడుపులో వ్యర్ధాలు తొలిగిపోవడమే.చాలా మందికి ఆహారం తీసుకున్న తరువాత కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యతో భాదపడుతూ ఉంటారు.అలాంటివారు భోజనం చేసిన తరువాత చల్లటి మజ్జిగను తీసుకోవడం చాల మంచింది.ఇది కడుపు ఉబ్బరంగా మరియు గ్యాస్ వంటి సమస్యలను సత్వరం నివారిస్తుంది.
మజ్జిగలో పోటాషియం ,క్యాల్షియం ,మిటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇది దాహార్తిని తీర్చడంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.శరీరాన్ని డీ హైడ్రేషన్ భారీ నుండి కాపాడుతుంది.డయారియాకు మజ్జిగ ఒక మంచి హోం రెమెడీ అని చెప్పవచ్చు.డయారియా తో భాధపడే వారు మజ్జిగలో అరటీ స్పూన్ డ్రై జింజర్ పొడిని కలిపి తీసుకోవాలి.రోజు మూడుపుటల మజ్జిగను ఈ విధంగా తీసుకోవడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
మజ్జిగ శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది.తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది.ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.మలబద్దకంతో భాధపడే వారు క్రమం తప్పకుండ మజ్జిగను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.