ఏపీలో అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు..ఎంత దారుణంగా జరుగుతున్నాయో..వారికి న్యాయం ఎలా జరుగుతుందో ఇదే సాక్ష్యం. నా పేరు నన్నపనేని రేఖ. మాది గుంటూరు గ్రామీణ మండలం ఉప్పలపాడు గ్రామం. మా గ్రామానికి చెందిన నాగశ్రావణ్‌కుమార్‌తో నాకు ఆరేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మాకు తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. రెంవడ సారి మళ్లీ అమ్మాయి పుట్టడంతో నాభర్త అందంగా లేవంటూ రకరకాలుగా చిత్రహింసలుపెట్టేవాడు. ఆయనకు మా అత్తామామ తోడుకావడంతో భరించలేనివిగా మారాయని బాధితురాలు వాపోయింది. తిండి తిప్పలు లేకుండా గత వారం రోజులుగా తనతోపాటు పసిపిల్లలకు తిండిపెట్టకుండా నరకం చూపిస్తున్నారు, పసిపిల్లలు ఆకలి కోసం అలమటిస్తున్నారని వేడుకున్నా వారు కనికరించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనతో కాపురం చేయనని, అందంగా లేవంటూ రకరకాల కారణాలు చెపుతూ వేధిస్తున్నారు. ఎవరికి చెప్పుకున్నా వినేవారే లేకపోవడంతో చివరిగా న్యాయం చేయాలని ఎస్పీని కోరారని ఆమె విలేకరులకు వివరించింది.నీళ్లతో ఆకలి తీర్చుతూ పసిపాప ఆకలి కోసం రోదిస్తుంటే పాలుపట్టే డబ్బాలో మంచినీళ్లు పోసి ఆ పసిపాపను ఏమార్చి ఆతల్లి ఆ పాప ఆకలి దప్పిక తీర్చినతీరు ఎస్పీ కార్యాలయంలో చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి
నా పేరు ఎలిజిబెత్‌రాణి. మాది గుంటూరు నగరం శారదాకాలనీ. గుంటూరు రెడ్డిపాలెంనకు చెందిన వెంకటేశ్వరరావుతో 11 ఏళ్లకిందట వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని నాలుగేళ్ల కిందట గొడవపెట్టుకొని వదిలేశాడు. నాకు ఆద]రణ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాను. అప్పుడు నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటానని నమ్మించి కేసు తీసివేయించాడు. కొద్ది నెలల తర్వాత నుంచి మళ్లీ ఆడపిల్లలను కన్నావంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆయన పెట్టే చిత్రహింసలు భరించలేక పురుగులమందుతాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నా. చుట్టుపక్కల వాళ్లు చూసి ఆసుపత్రిలో చేర్చడంతో మళ్లీ బతికా. నా ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేయాలి.
నా తండ్రి చనిపోవడంతో మా తల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట నాకు వివాహం చేశారు. మాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. నా భర్తతో మనస్పర్థలు రావడంతో ఏడాది కిందట పుట్టింటికి వచ్చాను. నాపై కన్నేసిన పినతండ్రి నాగేశ్వరరావు నన్ను లొంగతీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని మాటతీరు, ప్రవర్తనలో మార్పు చూసి నా తల్లికి, అమ్మమ్మకు విషయం చెప్పాను. వాళ్లు కూడా అతను కోరినట్లు ఉండమంటూ చెబుతున్నారు. అదేమంటే అన్నీతానై చూసుకుంటున్నప్పుడు నీకేంటి అభ్యంతరం అంటూ ఒత్తిడిచేస్తున్నారు. అతనితో కాపురం చేయాల్సిందేనంటూ గత మూడు నెలలుగా గృహనిర్భందం చేసి హింసిస్తున్నారు. గత నెల 31న వాళ్లకు తెలియకుండా తప్పించుకొని గుంటూరు వచ్చి స్నేహితురాలి వద్ద తలదాచుకుంటున్నాను. నాకు రక్షణ కల్పిస్తే నేను ఏదైనా ఉద్యోగం చేసుకొని నా బిడ్డను పోషించుకుంటానని కోరాను.
మామ తనతో కాపురం చేయమంటున్నాడు
రవికుమార్ అనే వ్యక్తితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అప్పటి నుంచి అత్తింటివాళ్ల వేధింపులు భరించలేకున్నా. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం రూ. 2 లక్షలు తీసుకురావాలన్నారు. మా తల్లిదండ్రులకు అంత ఆర్థికస్తోమతలేక ఇవ్వలేకపోయాం. దీంతో మా మామయ్య తన కుమారుడితో కాపురం చేస్తే మగపిల్లలు పుట్టలేదు కనుక తనతోకాని, తన కుమార్తె కొడుకులతో (ఆడపడుచు కుమారులతో) కాపురం చేసి మగపిల్లాడిని కనాలంటూ వేధిస్తున్నాడు. అందుకు అంగీకరించకపోతే పుట్టింటికి వెళ్లమంటూ బెదిరిస్తున్నాడు. మా పుట్టింటికి నన్ను పంపించి తన కుమారుడికి మరో వివాహం చేయాలనే పథకం పన్నారు. నా భర్తకు ఈ విషయం చెపితే నమ్మడం లేదు. వారికే వత్తాసుపలుకుతున్నాడు. నా భర్తకు కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు నన్ను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరాను.