కెరీర్ మొదట్లో నాకేమీ తెలిసేది కాదు. అందుకే దర్శకులు ఎలా నటించమంటే అలా నటించేశాను. అసలు కెమెరా ఏ యాంగిల్‌లో ఉందో కూడా చూసుకోకుండా నటించాను. ఆ తరువాత నా నటనను స్క్రీన్‌పై చూసి సిగ్గుతో తలదించుకున్నానని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎవరి కోసమో నటించాలి అనుకున్నా.., కానీ, ఎవరి కోసమో నటించాల్సిన గతి నాకు పట్టలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
see also : ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!
అయితే, ఇటీవల కాలంలో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజం పురుషాధిక్యంతో నడుస్తోందని, అయినా నాకు ఎప్పుడు కూడా అలాంటి ఛేదు అనుభవాలు ఎదురవ్వలేదని చెప్పుకొచ్చింది. అయితే, కొందరు హీరోయిన్లు మాత్రం బెడ్‌మీదకు రమ్మని తమను అడిగారంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పడం విన్నానని చెప్పింది. కేవలం సినీ ఇండస్ర్టీలోనే కాకుండా బయటి సమాజంలోనూ మహిళలపై వేధింపులకు పాల్పడుతుండటం బాధాకర విషయమని చెప్పింది కాజల్ అగర్వాల్.