ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు.
గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం చేసింది.దీనికి నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ శ్రేణులు హైదరాబాద్ మహానగరంలోని ఆ పత్రిక కార్యాలయం ఎదుట బైటాయించారు.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూశారు.అంతే కాకుండా పార్టీ నేతలను ,కార్యకర్తలను అరెస్టు చేయించి పరిస్థితులను చక్కదిద్దారు ..