ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు ,ప్రముఖ నటుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై నియోజకవర్గానికి చెందిన స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకున్న స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరతాయి అని చెప్పుకుందామని వచ్చారు.అయితే మహిళలు అక్కడ ఉన్న సంగతి చూసి కూడా కార్లో నుండి దిగకుండానే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయారు.
దీంతో తీవ్ర అవమానానికి గురైన మహిళలు ఆందోళనకు దిగుతూ నిరసనలకు దిగారు.అంతే అక్కడ పోలీసులు మహిళలు అని చూడకుండా చాలా దురుసుగా ప్రవర్తించి అక్కడ నుండి గెంటేశారు.ఓట్లు వేసి గెలిపించిన తమ సమస్యలను పరిష్కరించడం పక్కనపెడితే కనీసం వినడానికి కూడా సమయం కేటాయించడం గెలిపించి తప్పు చేశామని ఆయన నిరూపిస్తున్నారు అని మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ..