సీనియర్ న్యూస్ ప్రెసెంటర్ వీ6 రాధిక ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తన విధులు ముగించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లోని సువీల అపార్ట్ మెంట్ లో తను నివాసముంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ నోట్ లో రాసింది. కాగా రాధిక ఆర్నెళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది. దీంతో అప్పటి నుంచి ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రాధికకు ఒక కుమారుడు భానుతేజారెడ్డి(14) ఉన్నారు.