తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు టీజాక్ చైర్మన్ కోదండరాంతో భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోదండరామ్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు.
ఈ క్రమంలో ఏకాంతంగా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై అరా తీస్తూ చర్చించారు.అయితే త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ఇప్పటికే ప్రకటించిన కోదండ రామ్ ను రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం వెనక రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..