తెలుగు సినీ ఇండస్ర్టీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని మురళీ కృష్ణ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అని యాంకర్ అడిగి ప్రశ్నకు పోసాని మురళీ కృష్ణ తనదైన శైలిలో స్పందించారు. వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నా ఓటు అంటూ స్పష్టం చేశారు పోసాని. అలాగే చంద్రబాబుకు ఓటు వెయ్యకపోవడానికి కారణాలు, జగన్‌కే ఓటు వేయడానికి గల కారణాలు, వీటితోపాటు పవన్ కల్యాణ్‌పై తన అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టారు పోసాని.
సీఎం చంద్రబాబు గురించి పోసాని మురళీ కృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, తన పాలనలో ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తారని, ఆ వ్యక్తిత్వం తనకు నచ్చదన్నారు. గతంలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పొగుడుతూ వేలకొద్దీ పేజీలు రచనలు చేశాననీ గుర్తు చేశారు పోసాని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సమర్ధతగల నాయకుడు, నిజాయితీ పరుడని నమ్మి మోసపోయా..? కానీ, ఆ మాటలకు చంద్రబాబు వ్యక్తిత్వం చాలా దూరం అని ఇప్పుడు తెలుసుకున్నా. చంద్రబాబు నాయకత్వంలో ఈ ఏ పని చేయాలన్నా కుల ప్రాధాన్యతను బట్టే చేస్తున్నారని వాపోయారు.
see also :
చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!
పవన్ కళ్యాణ్‌కు నేను ఓటెయ్యను..!!
పవన్ కల్యాణ్ సినిమాల్లో ఓ పెద్ద స్టార్, నేను ఒప్పుకుంటా, కానీ రాజకీయాలకు మాత్రం పవన్ కల్యాన్ పనికిరారు. అతనికి సమాజంపై అవగాహన ఉండొచ్చు కానీ, ఆ అవగాహన పరిపాలనకు సరిపోదన్నారు పోసాని. ఇందిరా గాంధీ లేడీనే కదా..!! నా భార్య లేడీనే కదా..!! అటువంటిది ఇందిరా గాంధీలా నా భార్యను కూడా ప్రధానిని చేస్తానంటే ప్రజలు ఒప్పుకుంటారా..? అంటూ పవన్ కల్యాణ్‌పై తనకు గల అభిప్రాయాన్ని మీడియా ఎదుట బయటపెట్టారు పోసాని.
జగన్ పార్టీకే నా ఓటు : పోసాని
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. ప్రజల కోసం నిస్వార్ధంగా పోరాడగల పఠిమ ఉనన నాయకుడు వైఎస్ జగన్. నాడు రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తే, జగన్ మాత్రం ఒక్క మాటపై నిలబడి తన పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. అదే సీన్ ప్రత్యేక హోదా అంశంలోనూ రిపీటైందన్నారు. నాటి నుంచి నేటికి కూడా వైఎస్ జగన్ ఒకే మాటపై నిలబడి, ప్రత్యేక హోదా కోసం ప్రజలందరినీ ఒకేతాటిపైకి తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసల వర్షం కురిపించారు పోసాని. అందుకే 2019లో వైఎస్ జగన్‌కే నా ఓటు వేస్తా అంటూ తన ఇంటర్వ్యూను ముగించారు పోసాని కృష్ణ మురళీ.