తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇవాళ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఎంపీ సంతోష్ కుమార్ తో తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీలిద్దరూ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కాసేపు ముచ్చటించారు.
