రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ అన్నారు.ఇవాళ ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శెనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… శెనిగ పంట పండించిన రైతుల కోరిక మేరకు మంత్రి హరీష్ రావు సహకారంతో శెనిగల కొనుగోలు కేంద్రాన్నిప్రారంబించమన్నారు.అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక్క కేసీఅరె అని అన్నారు.తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నరు.అందుకోసమే ప్రాజెక్ట్ ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బంగారు తెలంగాణకు బాటలు వేసుకుందామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ పిలుపునిచ్చారు.
