రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.అన్నదాతలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.వానాకాలం పంట వేసే వరకు సహాయం అందిస్తామని తెలిపారు.పంట పెట్టుబడి,నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టికి వడగండ్ల కడగండ్లను తీసుకెల్తానని మంత్రి అన్నారు.రెండురోజుల్లో పంట నష్టంపై నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ రావు ఆదేశించారు. అకాల వర్షాలు,వడగండ్లకు దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ , అగ్రికల్చర్ అధికారులతో కలిసి మంత్రి హరీశ్ రావు సోమవారం సాయంత్రం పరిశీలించారు.సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలకు పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నాంచారుపల్లి , బక్రిచెప్యాల ,ఎల్లుపల్లి గ్రామాలలో నష్టపోయిన పంటను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
అధైర్యపడొద్దని,అండగా ఉంటామని మంత్రి ధైర్యం చెప్పారు. అన్నదాతలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.వచ్చే వానాకాలం లో వేసే పంట వరకు సహాయం అందేలా చూస్తానని హరీశ్ రావు తెలిపారు.ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు పంటలకు ఇచ్చే 8000 పెట్టుబడి సహాయంతో పాటు ఇన్ ఫుడ్ సబ్సిడీ సహాయం కూడా ఒకే సారి అందిస్తామన్నారు.పంటల నష్టపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లి సహాయం అందిస్తామని భరోసానిచ్చారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పారు.గత సంవత్సరం వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు పూర్తిస్థాయిలో దాదాపు 11కోట్లు నష్టపరిహారం అందించామని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతు బిడ్డ అని అన్నారు.
వడగండ్ల వానతో జరిగిన పంట నష్టం పై రెండు రోజుల్లో నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు.
రెండు రోజులుగా తొమ్మిది మండలాల్లో 60గ్రామాల లో పంటలకు భారీగా నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం 2611 హెక్టార్లలో వరి , 300 హెక్టార్లలో కూరగాయలు ,800 హెక్టార్లలో మామిపంటకు నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా, గ్రామాలు, రైతుల వారిగా నివేదిక సిద్దం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది అన్నారు.వరి పంటకు క్రాప్ లోన్ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తానన్నారు.సంబంధిత ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులతో కూడా మంత్రి రైతుల సమక్షంలోనే మాట్లాడారు.మంత్రి వెంట సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకరామిరెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఉన్నారు.