Home / POLITICS / కాంగ్రెస్ నేతలను నిలదీయండి.. మంత్రి హరీష్

కాంగ్రెస్ నేతలను నిలదీయండి.. మంత్రి హరీష్

ప్రజావ్యతిరేక కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలకు తాగు,సాగునీరు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను తిప్పికొట్టాలని ఆయన సోమవారం నాడు కోరారు.తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరగకుండా కోర్టులలో కేసులు  కోర్ట్ ల్లో కేసులు వేయించిన వారి కి సంబంధించిన అన్నీ ఆధారాలు తమ దగ్గర ఉన్నట్టు తెలియజేశారు.పాలమూరు పథకం పై , భూ సేకరణ , గ్రీన్ ట్రిబ్యునల్ ,కాళేశ్వరం ప్రాజెక్టు కేసులు వేశారని చెప్పారు.

చనిపోయిన వారి పేరుతో, ఆఫీడఫీట్ లు వేసి దొంగ సంతకాలు, దొంగ ఫోర్జరీలతో కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని అన్నారు.ప్రాజెక్టులపై ప్రభుత్వం జరిపిన ప్రజాభిప్రాయసేకరణ ను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారని అన్నారు.ప్రాజెక్టులు పూర్తయితే రైతుల ఆత్మహత్యలు తగ్గిపోతాయని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేందుకు ప్రాజెక్టులను అడ్డుకోవడమే శరణ్యమని ప్రతిపక్షం దివాళా కోరు రాజకీయాలకు పాల్పడుతున్నట్టు హరీష్ రావు ఆరోపించారు.తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేసేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీసి వారి బండారాన్ని బట్టబయలు చేయాలని కోరారు.ఉత్తర తెలంగాణ లో కాంగ్రెస్ నాయకులు నిర్వహిస్తున్న బస్సు యాత్రలను అడ్డుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు.ఉనికి కోసమే కాంగ్రెస్ బస్సుయాత్రలు జరుపుతున్నదని, ప్రజలు వాళ్ళను ఎప్పుడో తిరస్కరించారని అన్నారు.బస్సుయాత్రల సందర్భంగా జరిపే బహిరంగసభలలో వినడానికి వచ్చే జనం కన్నా వేదికపై ప్రసంగించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని మంత్రి హేళన చేశారు.కాంగ్రెస్ నాయకులకు అధికారం లేకపోవడంతో విలవిలలాడిపోతున్నారని అన్నారు.అడుగడుగునా అధికార దాహం కనిపిస్తున్నదని అన్నారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతి లో జరుపుతున్న సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని హరీష్ రావు విమర్శించారు. అలాంటి వారికీ యాత్రలు చేసే హక్కు లేదన్నారు.’కాగ్’నివేదిక పేరుతో కోడిగుడ్డుపై ఈకలు పీకే పనిలో కాంగ్రెస్ నాయకులున్నట్టు మంత్రి ఎద్దేవా చేశారు.కెసిఆర్ ప్రభుత్వం పై బురదజల్లడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు.2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని గుర్తు చేశారు.తాము 2014 ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు, కొత్తగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నామని మంత్రి తెలిపారు.ప్రజలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కెసిఆర్ పైన స్పష్టత ఉందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి అనుభవంలోకి వచ్చాయని మంత్రి చెప్పారు.కాంగ్రెస్ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలు, అవినీతిపైన కాగ్ నివేదికలు ఇచ్చినప్పుడు ఆ నివేదికలను కాంగ్రెస్ ఖాతరు చేయకపోగా కాగ్ నివేదికలు తప్పుల తడక అని అన్నారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తప్పుపట్టే అధికారం ‘కాగ్ ‘కు లేదని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పారని హరీష్ రావు తెలిపారు.కాగ్ నివేదిక బైబిల్,ఖురాన్,భగవద్గీత కాదని కిరణ్ కుమార్ రెడ్డి అపహాస్యం చేశారని మంత్రి గుర్తు చేశారు.కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వై.ఎస్,కిరణ్,రోశయ్య వంటి వారంతా కాగ్ ను తప్పు పట్టారని చెప్పారు.కాంగ్రెస్ పదేళ్ళ హయాంలో జరిగిన అనేక అవకతవకలను,ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యాన్ని,భూముల పందేరాన్ని ‘ కాగ్ ‘తప్పు పట్టినప్పుడు ఆ సంస్థ నివేదికలను లెక్క చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు టీఆర్ ఎస్ ప్రభుత్వం పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లడానికి ‘ కాగ్’ నివేదికలనే ప్రస్తావిస్తూడడం విడ్డూరంగా ఉందన్నారు.గుజరాత్ లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా పాలించిన 9 సంవత్సరాలలో పలు మార్లు ఆ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ‘కాగ్ ‘ ప్రస్తావించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.’కాగ్’ నివేదిక తప్పులతడక అంటూ గతంలో ప్రధానిగా ఉన్నప్పుడూ డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పార్లమెంటులో ఆరోపించారని మంత్రి చెప్పారు.బిజెపియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలో, బిజెపి పాలిత రాష్ట్రాలలో ‘కాగ్ ‘నివేదికల్లో తేడాలు కన్పిస్తున్నాయని ఇరిగేషన్ మంత్రి అన్నారు.బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణం, వాటి అభివృద్ధిపై పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండీచర్ గా చూపారాణి తెలంగాణ వంటి రాష్ట్రాలలో రోడ్ల అభివృద్ధి పనులకు పెట్టిన ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపలేదన్నారు.ఇది కేవలం సాంకేతిక అంశమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఈ విషయాలను భూతద్దంలో చూపి ప్రజల్ని తప్పుదోవపట్టించేందుకు గోబెల్స్ ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు పూనుకున్నారని అన్నారు.నో

టికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల్లో లోకువ అవుతున్నారన్నరు తెలంగాణ లో జిఎస్టీ, జాతీయ తలసరి ఆదాయం, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టె ఖర్చు బాగున్నాయన్న విషయం కాగ్ చెప్పినా ఆ పాజిటివ్ అంశాలను ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఖర్చు విషయం లో మిగిలిన రాష్ర్టాల్లో 19.7శాతం ఉంటే తెలంగాణ లో 28 శాతం ఉందని, వ్యవసాయం, సంక్షేమం, ప్రాజెక్టు ల లాంటి వాటిలో సాధించిన పురోగతి పై కాగ్ మాట్లాడిందన్నారు. కర్ణాటక, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయాలని సవాలు చేశారు. కర్ణాటక మంత్రి రెవన్న మీ పార్టీ నాయకులే ఇక్కడి అభివృద్ధి పట్ల కితాబు ఇచ్చారని గుర్తు చేశారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులు , పథకాలు కెసిఆర్ అమలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat