తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లోని కొన్ని మార్పులను మాత్రమే కాగ ఎత్తి చూపిందని ..తప్పు ఎక్కడ తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదని మంత్రి హరీష్ చెప్పారు.