తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకులాల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం .
