నారా చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి ఇటివల మూడో పెళ్లి చేస్కోబోతున్నాడు అని వార్తలు వస్తున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను కలిశారా ..?.ఇప్పటికే రాష్ట్రంలో ఇంట బయట పలు అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల వర్షం కురిపించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతో సరిగ్గా రెండు యేండ్ల కిందట అంటే 2016 మార్చి నెలలో లండన్ లో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయ మాల్యాను కలిశారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
అక్కడితో ఆగకుండా పార్టీ విరాళం కోసం ఏకంగా నూట యాబై కోట్ల రూపాయలను తీసుకున్నారు.ప్రస్తుతం ఢిల్లీ బాట పట్టిన చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసమే ..ఎక్కడ కేంద్రం సీబీఐ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తుందేమో అనే భయంతో ఆయన వెళ్ళుతున్నారు అని ఆయన ఆరోపించారు ..