ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.మనం ఆత్మహత్య చేసుకుంటే మన జీవితాన్ని బాగు చేసుకునే అవకాశం కోల్పోతామని.. కష్టాలు మాత్రం పోవని ట్వీట్ చేసింది రష్మి.అంతేకాకుండా ఏవైనా బాధలు ఉంటే మన స్నేహితులు, బంధువులతో చెప్పుకోవాలని కానీ.. పిరికి వాళ్లలా ఆత్మహత్య చేసుకోవద్దని సూచించింది.తాను మొదటగా సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డానని, అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్లానని యాంకర్ రష్మి ఆ ట్వీట్ లో పేర్కొంది.
