అవును, జనసేన పార్టీ ఫ్యాన్ క్లబ్‌కు ఎక్కువ, తోక పార్టీకి తక్కువ. జనసేన పార్టీ పరిస్థితి కూడా ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతుందని నేనెప్పుడో చెప్పాను. చివరకు నేను చెప్పిందే నిజమైంది. పార్టీ కోసం ప్రేమతో, జీవితాన్ని పణంగాపెట్టి శ్రమిస్తున్న కార్యకర్తలను పవన్ కల్యాణ్ గుర్తించకపోగా, డబ్బు ఇచ్చి మరీ పార్టీ టిక్కెట్‌ను ఆశించి జనసేనలో చేరిన ఓ వ్యక్తికి పవన్ కల్యాన్ ప్రాధాన్యత ఇవ్వడమేంటని నేను ప్రశ్నిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్.
కాగా, ఇవాళ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పట్నుంచి ఇప్పటి వరకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన దిలీప్ సుంకరను పక్కన పెట్టి, మధ్యలో వచ్చిన వారికి పవన్ కల్యాన్ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే జనసేన పార్టీలో డొల్లతనం తెలుస్తుందన్నారు. పవన్ కల్యాన్ సినీ నటుడు మాత్రమే తప్ప.. ఎప్పటికీ రాజకీయ నాయకుడైతే కాలేడన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవంగా జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకుని జనసేనకు దూరంగా ఉండాలని సూచించారు కత్తి మహేష్.