ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ చేస్తా, నిరుద్యోగ భృతి, ఇలా చాలా హామీలతో ప్రజలను మభ్యపెట్టి 2014 చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే, 2014లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి ఇప్పటీకి ఏ ముఖ్యమంత్రిపై రానన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరంలో కూడా చంద్రబాబు తన మంత్రులతో కలిసి కేంద్రం నుంచి వచ్చిన నగదును దారి మళ్లించారన్న ఆరోపణలకు పోలవరం తహశీల్దారు బదిలీ ఉదంతం మరింత ఆజ్యం పోసింది. ఆ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ ఇటు ప్రజాస్వామిక వాదులతోపాటు బీజేపీ నేతలు, వైసీపీ నేతలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పోలవరంపై సీబీఐ ఎన్‌క్వైరీ వేయడం ఆలస్యం.. ఆ వెంటనే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ పలు కథనాలు ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. అయితే, పోలవరం ప్రాజెక్టు భారీ కుంభకోణాన్ని పక్కనపెట్టి, పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో టీడీపీ సర్కార్ దోచుకున్న సొమ్మును ఆధారాలతో సహా అంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సారి ఆ కథనం సారాంశం పరిశీలిస్తే..!!
see also : విద్యార్థులకు జగన్ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!
ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి, భూ సేకరణ చేసి ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. పట్టిసీమ ప్రాజెక్టుకు వేసింది 24 పైప్‌లు అయితే, వాటిని 30 పైపులుగా చూపి రూ.342 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం స్వాహా చేసింది. అలాగే, పట్టిసీమ ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ పేరుతో టెండర్లు పిలవకుండానే రూ.90 కోట్లు సీఎం చంద్రబాబు కాజేశారని చెప్పిన కాగ్ నివేదికను ఆధారంగా పేర్కొంది సోషల్ మీడియా కథనం. అంతేకాకుండా, మట్టిని తీయడానికి రూ.67 కోట్లు ఖర్చు చేసినట్లు పట్టిసీమ ప్రాజెక్టు లెక్కల్లో చేర్చారని, అదంతా చంద్రబాబు అవినీతి భాగోతం. పట్టిసీమ ప్రాజెక్టులో తవ్విన మట్టిని.. ఒక లారీ మట్టి రూ.4 లక్షలు వంతున చంద్రబాబు అమ్ముకొన్నారని ప్రధాన ఆరోపణ. ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబును ఏ1, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏ2 నిందితులుగా సోషల్ మీడియా కథనం ప్రచురించింది.
see also :
విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ అవార్డు..!!
మంత్రి దేవినేని ఉమా అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఏపీ రాజధాని అమరావతి, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంతో కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయి. పక్కా ఆధారాలు లభించడంతో చంద్రబాబుపై సీబీఐ ఎన్‌క్వైరీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐ ఎంత త్వరగా విచారణ ప్రారంభిస్తే అంతే త్వరగా దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు అవుతారని, అంతేకాకుండా, ఈ కేసుకు మరో నలుగురు ఐఏఎస్ స్థాయి అధికారులతోపాటు, మరో ఇద్దరు టీడీపీ నేతలు అరెస్టు కావడం కన్ఫాం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏదేమైనా చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ రోజుకో వార్త పత్రికల్లో వెలువడుతుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.